త్వరలోనే లీటర్ పెట్రోల్ రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.3 పెంపు
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు, దానికితోడు దేశీయ మార్కెట్లో సబ్సిడి ధరకే పెట్రోల్‌ను విక్రయిస్తుండటంతో చమురు కంపెనీలు ప్రతి లీటరు పెట్రోలో విక్రయంపై రూ.8 వరకూ నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో, పెట్రోల్‌ను సబ్సిడి ధరకు విక్రయించడం వలన కలిగిన నష్టాలను భర్తీ చేయాల్సిందిగా చమురు కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తుండటంతో త్వరలోనే వీటి ధరలను సవరించాలని సర్కారు యోచిస్తోంది. ఇదే గనుక జరిగితే లీటరు పెట్రోల్‌పై కనీసం రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధర పెరిగే అవకాశం ఉంది.
పెట్రోల్ ధరల పెంపుపై రాజ్య సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. పెట్రోల్ ధరలు హద్దులు లేకుండా పెరిగిపోతున్నాయని, వాటిని అదుపులో పెట్టడం కష్టమని, సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోయినట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే, వాత పెట్టి వెన్న పూసిన చందంగా, మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపబోమని, అందులో కొంత భారాన్ని మాత్రమే వారిపైకి బదిలీ చేస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications









