తక్షణమే పెట్రోల్ ధరలు పెంచాలి: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు
గడచిన 15 రోజులుగా గమనిస్తే, సింగపూర్ మార్కెట్ రేట్ల ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.37 చొప్పున నష్టాలు వాటిల్లాయని, ప్రస్తుతం ఈ నెలలో ఇది రూ. 3.56కి పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చైర్మన్ ఆర్‌ఎస్ బుటోలా తెలిపారు. జులై 24న ప్రభుత్వ రంగ చమురు కంపెనీ లీటర్ పెట్రోల్‌పై 70 పైసల చొప్పున పెంపును విధించిన సంగతి తెలిసిందే.
జులై 2010లో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలను తొలగిస్తూ, వీటి నిర్ణయాధికారాన్ని ప్రభుత్వ రంగ పెట్రోల్ కంపెనీల చేతికి అప్పగించింది. అప్పటి నుంచి పలుమార్లు పెట్రోల్ ధరలు పెరుగుతూ రావటం జరిగుతోంది. అయినప్పటికీ, చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచాలంటే ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరల నియంత్రణను తిరిగి ప్రభుత్వమే చేపట్టాలని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అభిప్రాయ పడుతోంది. దీని గురించి బుటోలా మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసి ప్రభుత్వమే అజమాయిషీ చేసినట్లయితే, కనీసం పరిహారమైనా లభిస్తుందని చమురు కంపెనీలు భావిస్తున్నాయని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications









