ఒలంపిక్ క్రీడాకారులకు ఆడి కార్లు బహుకరించిన డిఎల్ఎఫ్

ఇటీవల జరిగిన ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం మరియు ప్రముఖ రియాల్టీ సంస్థ డిఎల్ఎఫ్‌లు ఆడి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చాయి. రెజ్లర్స్ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బ్యాడ్‌మింటన్ తార సైనా నెహ్వాల్, షూటర్ గగన్ నారంగ్‌లను ఆడి క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీలు వరించాయి. కాగా.. సైనా నెహ్వాల్‌కు సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆంధ్రాక్రికెట్ బ్యాడ్‌మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ ఆధ్వర్యంలో ఓ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ కారును బహుకరించిన విషయం తెలిసినదే.

ఒలంపిక్ క్రీడల్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేసినందుకు గాను, ఈ ఆటగాళ్లకు హర్యానా సర్కారు సహకారంతో డిఎల్ఎఫ్ ఆడి క్యూ5 కార్లతో సత్కరించింది. అంతేకాకుండా.. ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించకపోయినప్పటికీ, అందులో పాల్గొన్న 15 మంది క్రీడాకారులకు మారుతి సుజుకి అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4 కార్లను బహుమతిగా ఇచ్చారు.


జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) క్యూ5 2.0 టిడిఐ క్వాట్రో ఇంజన్‌తో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న క్యూ5 ఎస్‌యూవీ ధరలు రూ. 39.06 లక్షల నుంచి రూ. 45.12 లక్షల వరకు (ఎక్స్‌ షోరూమ్, మహారాష్ట్ర) ఉన్నాయి.

ఆడి క్యూ5 ఎస్‌యూవీ 17ఇంచ్ అల్లాయ్ వీల్స్, జెనాన్-ప్లస్ హెడ్‌లైట్స్, డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్స్, లెథర్ ఇంటీరియర్స్, బహుళ ఫీచర్లు కలిగిన 4-స్పోక్ లెథర్ స్టీరింగ్ వీల్ వంటివి ఇందులో ప్రధాన ఫీచర్లు. కాన్సెర్ట్ రేడియాతో కూడిన ఆడి మీడియా ఇంటర్‌ఫేస్, స్టోరేజ్ ప్యాకేజ్, రియర్ పార్కింగ్ ఎయిడ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. క్యూ5లో అమర్చిన 2.0 టిడిఐ ఇంజన్ 125 కెడబ్ల్యూల, 170 హెచ్‌పి(హార్స్ పవర్)ల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ (న్యూటన్ మీటర్)ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. కొత్త ఆడి క్యూ5 సగటున ప్రతి లీటరుకు 12.80 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 30, 2012, 14:25 [IST]
English summary
Olympic medalists wrestlers Sushil Kumar and Yogeshwar Dutt, badminton star Saina Nehwal and shooter Gagan Narang gets Audi Q5s for bringing laurels to the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+