పెంగ్విన్ మస్కట్‌గా హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ పబ్లికేషన్ సంస్థ "పెంగ్విన్"కు చెందిన భారతీయ అనుబంధ కంపెనీ "పెంగ్విన్ ఇండియా" భారత్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పెంగ్విన్ ఇండియా, భారతీయ ఐకానిక్ కారు అంబాసిడర్‌ను తమ మస్కట్‌గా ఉపయోగించుకోనుంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రెండు కంపెనీలు కూడా విభిన్న విభాగాల్లో ప్రత్యేక మైలురాళ్లను అధిగమించాయి. హిందూస్థాన్ మోటార్స్ ఫ్లాగ్‌షిప్ సెడాన్ అంబాసిడర్‌ను ఈ వేడుకలం పెంగ్విన్ ఇండియా ప్రత్యేకంగా ముస్తాబు చేసి దేశవ్యాప్తంగా ప్రచారం సాగించనుంది.

ఈ కారును పెంగ్విన్‌కు అత్యంత ప్రాచుర్యమైన తెలుపు, నారింజ రంగుల కలయికతో కారును పెయింట్ చేసి దానిపై 25 లోగోను ముద్రించింది. అంతేకాకుండా ఇంటీరియర్స్‌లో ప్రీమియం లుక్‌నిచ్చే విధంగా లెథర్ సీట్లతో డిజైన్ చేశారు. ఈ మస్కట్‌లో ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకాల క్రమం స్పెషల్ పాపులర్ పెంగ్విన్స్‌లను కూడా ఇందులో ఉంచారు.

ఈ అంబాసిడర్ కారు దేశవ్యాప్తంగా ఉన్న పుస్తకాల స్టోర్లను సందర్శించి, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి పండుగలను జరుపుకోనుంది. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జరగునున్న వరల్డ్ బుక్ ఫెయిర్‌లో కూడా ఈ పెంగ్విన్ అంబాసిడర్ కారు దర్శనమివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 10, 2012, 13:02 [IST]
English summary
Leading publishing house Penguin India has selected Hindustan Motors' Ambassador car as their 25th Anniversary Mascot. As part of our 25th anniversary celebrations, to promote and celebrate the joy of reading, a special Penguin Car, an orange Ambassador with the distinct Penguin classics inspired design, will be touring India. It will be appearing at Penguin events across the country, bringing some of Penguin's well-known authors to events and book-stores across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+