పెట్రోల్ ధర పెంపుకు మాకు సంబంధం లేదు: ప్రణబ్
బుధవారం అర్థరాత్రి నుండి పెట్రోల్ ధరను లీటరుకు రూ.7.50 చొప్పను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో పెట్రోల్ ధరలు పెంచటం గురించి విలేఖరులు ప్రణబ్ ముఖర్జీని ప్రశ్నించగా.. సుమారు రెండేళ్ల క్రితమే పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలు ఎత్తి వేసిందని, తాజా పెంపును చమురు కంపెనీలే నిర్ణయించాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 2010లో ప్రభుత్వం పెట్రోలుపై ధరల నియంత్రణను ఎత్తివేసింది.
చమురు కంపెనీలు చివరిగా పెట్రోల్ ధరలను నవంబర్ 4, 2011లో పెంచాయి. ఆ తర్వాత ఐదు రాష్ట్రాల్లోని కీలక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పెట్రోల్ ధరలను పెంచకండని, నష్టాలను తామే భరిస్తామని ప్రభుత్వం చమురు కంపెనీలకు హామీ ఇచ్చింది. దీంతో అప్పటి నుండి పెట్రోల్ ధరలు పెరగలేదు. అయితే, సదరు ఎన్నికల్లో సర్కారుకు అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో, ఆ కోపాన్ని ఇలా పెట్రోల్ ధరల రూపంలో ప్రజలపై చూపిస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications









