త్వరలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
ఈ ఎన్నికల కారణంగా గత కొద్ది రోజులుగా ధరలను పెంచని చమురు కంపెనీలు అనువైన సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిసే వరకూ వరకూ పెట్రోల్ ధరల జోలికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు గడచిన రెండు నెలలుగా చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను సవరించలేదు.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో అధిక కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్‌ను భారత మార్కెట్లో సబ్సిడికే విక్రయిస్తుండటంతో చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. అయితే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకూ ఇంధన ధరలు పెరిగే ఆస్కారం ఉండకపోవచ్చనే వాదన కూడా ఉంది.
అయితే, ధరల పెంపు కోసం చమురు కంపెనీలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వస్తున్న తరుణంలో ఈ వాదనకు అంత బలం చేకూరే అవకాశం కనిపించడం లేదు. మొత్తమ్మీద ఈ సారి పెట్రోల్ ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టడటం ఖాయమని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications









