లీటర్‌పై రూ.1.60 మేర దిగిరానున్న పెట్రోల్ ధర

By Ravi

Fuel
పెట్రోల్ ధర తగ్గనుంది. డాలరుతో పోల్చుకుంటే రూపాయి విలువ కాస్త బలపడి చమరు కంపెనీల లాభాలు పెరగడంతో, లీటరు పెట్రోల్‌ ధరపై రూ.1.60 చొప్పున తగ్గింపును అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత రూపాయి విలువ ఐదు నెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఫలితంగా చమురు సంస్థల పెట్రో ఉత్పత్తుల దిగుమతుల వ్యయం తగ్గి, అమ్మకాలపై లాభాలు పెరిగాయి.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, బలపడిన రూపాయి విలువ కారణంగా, అక్టోబర్ 1, 2012 నుంచి లీటర్ పెట్రోల్ అమ్మకంపై రూ.1.60 మేర లాభం వస్తోందని, ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే త్వరలోనే పెట్రోల్ ధర తగ్గవచ్చని చెప్పారు. ఆగస్టు రెండవ వారంలో డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ రూ.55.58 నుంచి గత పక్షం రోజుల క్రితం 54.12కు స్థాయికి చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 126.11 డాలర్‌ల నుంచి 122.31 డాలర్లకు తగ్గింది.

కాగా.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఏడాది జూన్ 3న లీటర్ పెట్రోల్ ధరను రూ.2.02 చొప్పున పెంచగా, తిరిగి జూలై 24న 70 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్ విక్రయంపై లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ.. డీజిల్, కిరోసిన్, ఎల్‌పిజి విక్రయాలపై మాత్రం భారీగా నష్టపోతున్నాయి. సబ్సిడి ధరలకే వీటిని విక్రయిస్తుండటం వలన లీటర్ డీజిల్ అమ్మకంపై రూ.12, లీటర్ కిరోసిన్‌ అమ్మకంపై రూ.35.63, 14.2 కేజీల ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.468.50 చొప్పున చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,76,937 కోట్ల నష్టం వస్తుందని చమురు సంస్థలు పేర్కొన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 4, 2012, 10:01 [IST]
English summary
Petrol price may be cut by about Rs 1.60 per litre later this month as appreciation of rupee against the US dollar has helped state firms make profit on the fuel. Indian rupee appreciated to five-month high since the government announced allowing foreign direct investment (FDI) in multi-brand retailing. This has eased the cost of imports for oil firms, helping them make profit on sale of petrol.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+