లీటర్‌పై 56 పైసల చొప్పున తగ్గనున్న పెట్రోల్ ధర

మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత రూపాయి విలువ భారీగా పెరిగింది. ఫలితంగా చమురు సంస్థల పెట్రో ఉత్పత్తుల దిగుమతుల వ్యయం తగ్గి, అమ్మకాలపై లాభాలు పెరిగాయి. "అక్టోబర్ 9 నుంచి పెట్రోల్ ధరను ప్రతి లీటరుపై 56 పైసల (ఢిల్లీలో రాష్ట్ర పన్నులు కలపకుండా) చొప్పున తగ్గించాలని నిర్ణయిస్తున్నామ"ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది.
కాగా.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఏడాది జూన్ 3న లీటర్ పెట్రోల్ ధరను రూ.2.02 చొప్పున పెంచగా, తిరిగి జూలై 24న 70 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్ విక్రయంపై లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ.. డీజిల్, కిరోసిన్, ఎల్‌పిజి విక్రయాలపై మాత్రం భారీగా నష్టపోతున్నాయి. సబ్సిడి ధరలకే వీటిని విక్రయిస్తుండటం వలన లీటర్ డీజిల్ అమ్మకంపై రూ.12, లీటర్ కిరోసిన్ అమ్మకంపై రూ.35.63, 14.2 కేజీల ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.468.50 చొప్పున చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,76,937 కోట్ల నష్టం వస్తుందని చమురు సంస్థలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications








