పెట్రోల్ ధరల ఎఫెక్ట్: ఉత్పత్తిని తగ్గిస్తున్న తయారీదారులు

By Ravi

Hero MotoCorp
పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తన నియంత్రణలు ఎత్తివేసినప్పటి నుంచి, వాటి ధరలు పలుమార్లు పెరిగి ప్రస్తుతం లీటరు ధర రూ.75-80 (ప్రాంతాన్ని బట్టి)కు చేరడంతో వాహన కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు తగ్గు ముఖం పట్టాయి.

ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గి అమ్మకాలు తగ్గడంటో వాటి తయారీదారులు ఉత్పత్తిని కూడా తగ్గిస్తున్నారు. ఈ పరిస్థితులకు తోడు ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి ద్విచక్ర వాహనాల తయారీదారులను కలవరానికి గురి చేస్తోంది. దీంతో తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, గడచిన మూడున్నరేళ్ళలో ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తిని కుదించుకోవటం ఇదే మొదటి సారి.

ఇటీవల పెరిగిన వడ్డీ రేట్లు, విచ్చల విడిగా పెరుగుతున్న పెట్రోల్ ధరలే మార్కెట్ ట్రెండ్‌ను దెబ్బతీయడానికి కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాలను తగ్గించడం ద్వారా పెట్టుబడులను ఏకాస్త మేరకైనా సమీకరించుకోగలుగుతామనేది తయారీదారుల ఆలోచనగా తెలుస్తోంది. 2009 జనవరి తరువాత ఈ ఆగస్టులో మొదటిసారిగా మోటార్‌సైకిళ్ళ విక్రయాలు 8.46 క్షీణతను నమోదు చేశాయి.

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు మొదలుకొని చిన్న తరహా కంపెనీల వరకూ అన్ని తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకున్నట్లు సియామ్ వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇందులో హీరో మోటోకార్ప్ 14 శాతం ఉత్పత్తిని తగ్గించగా, బజాజ్‌ ఆటో 11.8 శాతం మేర తగ్గించాయి. అయితే, టూవీలర్ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన హోండా మోటార్‌సైకిల్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, సుజుకి మోటార్‌సైకిల్‌ కంపెనీలు మాత్రం ఈ పరిస్థితిని చక్కగా ఎదుర్కుంటున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 12, 2012, 11:06 [IST]
English summary
With sales in the motorcycle segment declining for the first time in three-and-a-half years, in a market saddled by surging interest rates and fuel prices, two-wheeler makers slashed production sharply last month to prevent build-up of inventory.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+