పెట్రోల్ ధర పెంపు ఎఫెక్ట్: తక్కువ ధరకే పెట్రోల్ కార్లు

పెట్రోల్ ధరలు తారాజువ్వల్లా ఒక్కసారిగా నింగికెగరడంతో, ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. అసలే పెట్రోల్ కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగా సాగుతుంటే, తాజాగా పెరిగిన పెట్రోల్ ధరలు మూలిగే నక్కపై తాటిపండు పండ చందంగా మారింది. దీంతో చేసిది లేక పెట్రోల్ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు, ఆటో కంపెనీలు బలవంతంగా డిస్కౌంట్లను, వివిధ ఆఫర్లను అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రధానంగా పెట్రోల్ కార్ల ఉత్పత్తినే ఆధారపడిన మారుతి సుజుకి, హోండా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఈ తాజా పెంపు తీవ్ర ఇబ్బందులను కలిగించనుంది. ఈ నేపథ్యంలో, కార్ కంపెనీలు పెట్రోల్ మోడళ్లపై సుమారు రూ50,000 వరకూ తగ్గింపులను అందించడమే కాకుండా.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ స్కీమ్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న కొన్ని రకాల పెట్రోల్ కార్లపై సుమారు రూ.30,000 వరకూ తగ్గింపులను అందిస్తుండగా, టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో రేంజ్ పెట్రోల్ కార్లపై రూ.10,000 నుండి రూ.50,000 వరకూ డిస్కౌంట్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. అలాగే, టాటా నానో కారుపై కూడా రూ.10,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది. మరో వైపు కొనుగోలుదారులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే పెట్రోల్ కార్ల కొనుగోలుపై తగ్గింపులతో కూడిన ఓ ప్రత్యేక స్కీమ్‌ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒకవేళ డీలర్లు పెట్రోల్ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లను ఆఫర్ చేయకపోయినా బేరమాడే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. పెట్రోల్ కార్ల ధరలు పెరిగిన విషయాన్ని అటుంచితే, తక్కువ ధరకే పెట్రోల్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని చెప్పవచ్చు. మరి మీరు కూడా పెట్రోల్ కారునే కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నట్లయితే, ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి లేదనే చెప్పాలి.. మీరేమంటారు...?

More from DriveSpark

Article Published On: Friday, May 25, 2012, 18:38 [IST]
English summary
After petrol prices were hiked by an all-time record of Rs 7.50 per litre, leading car makers Maruti Suzuki, Tata Motors and Hyundai Motor today announced discounts of up to Rs 50,000 on petrol models for a limited period.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+