లీటరు పెట్రోల్‌పై రూ.7.50 పెంపు, అర్థరాత్రి నుండే అమలు

అయిపోయింది... అంతా అయిపోంది.. ముందు నుండి ఊహిస్తున్నట్లుగానే పెట్రోల్ ధర ఒక్కసారిగా భగ్గుమంది. రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు ఏకంగా.. లీటర్ పెట్రోల్ ధరపై రూ.7.50 పెంపును విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నానాటికి బలహీన పడుతున్న రూపాయి కారణంగా చమురు దిగుమతి బిల్లు పెరిగిపోవటం, గత కొద్ది నెలలుగా పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో ఆ భారం కాస్తా తడిసి మోపెడైంది. ఇప్పుడు ఆ భారం మొత్తాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపింది.

బలహీన పడుతున్న రూపాయి విలువను పరిగణలోకి తీసుకుని తక్షణమే పెట్రోల్ ధరలను పెంచాల్సిన అవసరం ఉందని చమురు శాఖా మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మంగళవారం వ్యాఖ్యానించి తర్వాత రోజునే పెట్రోల్ ధరలు పెరగటం గమనార్హం. గడచిన జూన్ 2010లో పెట్రోల్ ధరలపై తమ నియంత్రణలు తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల కీలక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచవద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరింది. దీంతో అప్పటి నుండి చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచలేదు.

పెట్రోల్ ధరను సబ్సిడి ధరకే విక్రయిస్తుండటం, రూపాయి మారకపు విలువలో ఎంత మాత్రం మార్పు రాకపోవడంతో ఇక చేసేదే ఏమీ లేక పెట్రో భారాన్ని సాధారణ ప్రజలపై మోపేందుకు సర్కారు నడుం బిగించింది. పెట్రలో ధరలు ఒక్కసారిగా ఇంత అత్యధికంగా పెరగటం ఇదే మొదటి సారి. వ్యాట్ లేకుండా పెట్రోల్ ధర పెంపు రూ.6.28 గా ఉంది. దీనికి వ్యాట్ కలుపుకుంటే రూ.7.50 అవుతుంది (ఢిల్లీలో). ప్రస్తుతం ఢిల్లీలో రూ.65.64 లుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఈ రోజు అర్థరాత్రి నుండి రూ.73.14 లకు పెరగనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 23, 2012, 18:53 [IST]
English summary
The government on Wednesday announced a petrol price hike of Rs 7.50 per litre, effective from midnight today. With rupee depreciation leading to jump in oil import bill, Petroleum Minister S Jaipal Reddy on Tuesday had said that there was an immediate need to raise fuel prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+