తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు: దిగిరానున్న పెట్రోల్ ధరలు
గత నెలలో లీటర్ పెట్రోల్ ధరపై అదనంగా రూ.7.50 చొప్పను చమురు కంపెనలు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ధరల పెంపు సర్వత్రా నిరసనలు, బంద్‌లు జరగడంతో ఆయిల్ కంపెనీలు కాస్తంత దిగొచ్చి ఈ నెల ఆరంభంలో (జూన్ 2, 2012) లీటరు పెట్రోల్‌పై రూ.2 మేర తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరోసారి పెట్రోల్ ధరలు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు తగ్గముఖం పడుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను తగ్గించే సూచనలు కనిపిస్తుంది. చమురు కంపెనీల నియమం ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున సమావేశమై పెట్రోల్ ధరలను సమీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మన మార్కెట్లో పెట్రోల్ ధరలను పెంచటం, తగ్గించడంపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల ఆరంభంలో సమావేశమై, ధర తగ్గింపును ప్రకటించిన చమురు కంపెనీలు తరిగిన మళ్లీ సమావేశం కానున్నాయి. నేడో రేపో ఈ తగ్గింపుపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో సతమతవుతున్న సమాన్యుడికి ఈ తగ్గింపు కాస్తంత ఊరట కలిగించే ఆస్కారం ఉంది.
ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర:
ఇదిలా ఉండగా, దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రతి లీటరు పెట్రోల్‌పై 92 పైసల చొప్పున ధరను తగ్గిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర రూ.71.16 నుంచి రూ.70.24 లకు తగ్గింది. అయితే, ఇదే సమయంలో డీజిల్ ధర మాత్రం స్వల్పంగా పెరగనుంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.40.91 నుంచి రూ.41.28 లకు పెరగనుంది.


Click it and Unblock the Notifications








