పెట్రోల్ ధరను రూ.5 పెంచండి: చమురు కంపెనీలు
దీంతో వీలైనంత త్వరగా పెట్రోల్ ధరలను పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వస్తున్నాయి. చమురు కంపెనీల ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే, లీటర్ పెట్రోల్ ధర రూ.5 మేర పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్‌తో పాటుగా మొత్తం ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తవడంతో ధరల పెంపుకు చమురు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.
ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచవద్దని గతంలో ప్రభుత్వం చమురు కంపెనీలను ఆదేశించింది. దీంతో చమురు కంపెనీలు గడచిన డిసెంబర్ నెల నుండి పెట్రోల్ ధరలను సవరించలేదు. వాస్తవానికి పెట్రోల్ ధరలను పెంచే స్వతంత్ర్యత చమురు కంపెనీలకు ఉన్నప్పటికీ, ఈ కీలక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చమురు కంపెనీల నోరు మూయించింది. దీనివల్లనే ఇప్పుడు ఒక్కసారిగా వినియోగదారులపై రూ.5 భారం పడనుంది.


Click it and Unblock the Notifications









