యూపి ఎన్నికల తర్వాత పెరగనున్న పెట్రోల్ ధరలు!

Petrol Price Hike
పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమనబోతున్నాయి. వచ్చే నెల ఆరంభంలో లీటర్ పెట్రోల్ ధర రూ.3 మేర పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అత్యంత కీలక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తక్షణమే ధరలు పెంచే యోచనలో ఉన్నామని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఎన్నికలు అయ్యో వరకూ పెట్రోల్ ధరల జోలికి పోవద్దని ప్రభుత్వం చేసిన ఆదేశాల మేరకు గడచిన రెండు నెలల నుండి అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరలు ఉన్నప్పటికీ తాము ధరలు పెంచలేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ప్రతినిధులు తెలిపారు.

పెట్రోల్ ధరలపై ప్రభుత్వం నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత చమురు కంపెనీలు వారి ఇష్టానుసారంగా ధరలను పెంచుకుంటుపోతున్నాయి. వీరి తాజా నియమాల ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై ధరలను సమీక్షించి పెంపు విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న యూపి అసెంబ్లీ ఎన్నికలు అత్యంత సున్నితమైన అంశంతో కూడుకున్నవి కావడం, ఈ సమయంలో పెట్రోల్ ధరలను సవరిస్తే అల్లకల్లోలాలు జరగుతాయనే భయంతో ఇవి ముగిసే వరకూ పెట్రోల్ ధరల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది.

ఈ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమనడం ఖాయం. అలాగే వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో డీజిల్ ఇంధన, డీజిల్ కార్ల గురించి ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని ఇటు కంపెనీలు, అటు కస్టమర్లు ఆందోళనలో ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 14, 2012, 12:03 [IST]
English summary
Petrol Prices may be hiked by Rs 3 per litre early next month after the crucial assembly election in Uttar Pradesh, industry executives said on Monday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+