లీటరుపై రూ.2.46 చొప్పున తగ్గిన పెట్రోల్ ధరలు
ఇది వరకు చెప్పుకున్నట్లుగానే పెట్రోల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు గురువారం అర్థరాత్రి నుంచి పెట్రోల్ ధరను తగ్గించాయి. ప్రతి లీటర్ పెట్రోల్‌పై రూ.2.46 చొప్పను తగ్గింపును అందిస్తున్నామని చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. వాస్తవానికి జులై 1వ తేదీన పెట్రోల్ ధరలను తగ్గించాల్సి ఉండగా, అనుకున్న దాని కంటే ముందుగానే పెట్రోల్ ధర తగ్గటం విశేషం.
అయితే, లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ.4 వరకూ తగ్గింపు లభిస్తుందని ఆశించగా, కేవలం రూ.2.46 మాత్రమే తగ్గింపు లభించడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.67.78 గా ఉంది. పెట్రోల్ ధరల విషయంలో గతంలో ఇది వరకెన్నడూ లేదీని విధంగా గడచిన మే 23వ తేదీన చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.7.54 చొప్పును పెంపును విధించిన సంగతి తెలిసిందే.
అనంతరం, ఈనెల 2వ తేదీన చమురు కంపెనీలు పెట్రోల్ ధరను స్వల్పంగా లీటరుపై రూ.2 మేర తగ్గింపును ప్రకటించాయి. ఈ తాజా తగ్గింపైనా వినియోగదారులకు కాస్తంత ఉపశమాన్ని కలిగిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉండగా, పెట్రోల్ ధరలు కూడా ఎప్పటికప్పుడు మారే బంగారం ధరల మాదిరిగానే ప్రతిరోజూ సమీక్షించి తగ్గింపు లేదా పెంపుదలపై నిర్ణయాలను తీసుకోవాలని చమురు కంపెనీలు ఓ ప్రతిపాదన చేస్తూ దానిని సర్కారు ముందుచాయి. ఈ తరహా విధానాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్, బ్రెజిల్ వంటి దేశాల్లో అనుసరిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ప్రకటిస్తే, చమురు ధరలు కూడా ఏ రోజుకు ఆ రోజు పెరగటం లేదా తగ్గటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








