పెట్రోల్ ధరపై రూ.2 తగ్గింపును ప్రకటించిన చమురు కంపెనీలు

టాక్స్‌లను పరిగణిలోకి తీసుకోకుంటే ఈ తగ్గింపు కేవలం ప్రతి లీటర్‌పై రూ.1.68 మాత్రమే. దీనికి 20 శాతం వ్యాట్‌ను కలుపుంటే ఈ తగ్గింపు రూ.2 అవుతుంది. గత నెల 23వ తేదీన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ ధరను, గతంలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ప్రతి లీటరుపై రూ.7.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించిన కారణంగా లీటరుపై రూ.1.60 ధర తగ్గిన సంగతి తెలిసిందే.
కాగా.. తాజాగా తగ్గించిన రూ.2 తగ్గింపు దేశవ్యాప్తంగా వర్తించనుంది. అయితే, పెరిగిన రూ.7.50 లతో పోల్చుకుంటే ఈ తగ్గింపు నామమాత్రమే అనిచెప్పవచ్చు. వాత పెట్టి వెన్న రాయమంటే ఇదేనేమో..! మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








