శ్రీసిటీలో ప్లాంట్‌ను ప్రారంభించిన పియోలాక్స్ ఇండియా
పియోలాక్స్ సంస్థ గ్లోబల్ మార్కెట్ల కోసం కాయిల్ స్ప్రింగ్స్, ఫ్లాట్ స్ప్రింగ్స్, వైర్ ఫార్మ్, మెటల్, ప్లాస్టిక్ ఫాస్ట్‌నర్స్ తదితర ఆటోమొబైల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. పియోలాక్స్‌కు ఇప్పటికే అమెరికా, బ్రిటన్, చైనా, థాయ్‌లాండ్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. తమిళనాడు రాజధాని చైన్నై నుంచి 55 కి.మీ. దూరంలో శ్రీసిటీ ఉంది.
శ్రీసిటీలో ఇప్పటికే 23 దేశాలకు చెందిన 80 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీనిని సింగపూర్‌కు చెందిన జురాంగ్ కన్సల్టెంట్స్ పనిచేయి-జీవించు-సంపాధించు-పాలించు అనే ప్రాతిపధికన డిజైన్ చేశారు. ఇందులో ఆటోమోటివ్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ అండ్ వేర్‌హౌసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్/ఫార్మా, ఐటి మరియు ప్రత్యామ్నాయ విద్యుత్ వంటి తదితర రంగాలకు చెందిన కంపెనీలున్నాయి.
శ్రీసిటీలో 12 జపాన్ కంపెనీలు తమ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నాయని, వీటిల్లో ఉత్పత్తిన ప్రారంభించనున్న కంపెనీలలో పియోలాక్స్ మూడవదని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ అధ్యక్షుడు రమేష్ సుబ్రమణియన్‌తో పాటు సెజ్‌లో భాగస్వాములుగా వున్న నిస్సాన్, అశోక్‌లైలాండ్, రినాల్ట్, ఇనాబాటా, హోండా తదితర కంపెనీల అధికారులు కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications









