ప్రీమియర్ రియో ఎస్‌యూవీ కోసం 200 కొత్త సర్వీస్ స్టేషన్లు

అంతేకాకుండా.. ప్రస్తుతం ప్రీమియర్‌కు ఉన్న 50 డీలర్లకు అదనంగా మరో 30 డీలర్‌షిప్ కేంద్రాలను నెలకొల్పాలని, జూన్ 2012 నాటికి తమ మొత్తం డీలర్ల సంఖ్యను 80కు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది ముగుసేనాటికి దేశవ్యాప్తంగా 100 డీలర్‌షిప్ కేంద్రాలను, 300 సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సరసమైన ధరలకే రియో విడిభాగాలను విక్రయించేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇక రియో కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయానికి వస్తే.. ఇందులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యంగా, విలాసంగా ప్రయాణించవచ్చు. ఇది నాలుగు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ రియో కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ.4.70 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, డీజిల్ వేరియంట్ రియో ధర రూ.5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇంకా ఇందులో పవర్ స్టీరింగ్, ఫోల్డబిల్ రియర్ సీట్, ఏబిఎస్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్ మరియు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ వంటి మరెన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








