త్వరలోనే మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం: హర్యానా సిఎమ్
త్వరలోనే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని తాము కూడా కోరుకుంటున్నామని హుడా కోల్‌కటాలో జరిగిన ఎమ్‌సీసీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలో మాట్లాడుతూ అన్నారు. అయితే ఖచ్చితంగా ఏ తేదీ నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గడచిన నెల మూడవ వారంలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులోని కార్మికులు, కంపెనీ యాజమాన్యంతో గొడవకు ప్లాంటులో పెద్దఎత్తున విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ గొడవల్లో కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) అవనిష్ కుమార్ దేవ్ ప్రాణాలు కోల్పోగా, పలువురు కంపెనీ సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో మారుతి సుజుకి యాజమాన్యం జులై 21 నుంచి మానేసర్ ఫ్యాక్టరీ లాకౌట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు సరిగ్గా లేవనే వాదనను ఆయన ఖండించారు.
ఈ విషయంపై భూపేందర్‌సింగ్ హుడా స్పందిస్తూ.. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలకు మారుతి సుజుకి సంతృప్తి చెందిందని, కంపెనీ మానేసర్ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్లబోదని చెప్పారు. దేశవ్యాప్తంగా పరిగణిస్తే, హర్యానాలో రాష్ట్రంలోనే క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉందని, మారుతి సుజుకి అల్లర్ల లాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ, మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ఎంత త్వరగా ఉత్పత్తి ప్రారంభమైతే అంత మంచిదని ఇటు కస్టమర్లు, అటు కార్మికులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications









