వెంటో కారు అగ్నిప్రమాదంలో గాయపడిన డ్రైవర్ మృతి

VW Vento Fire
పూనేలోని ఎఫ్‌సి రోడ్డులో జరిగిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారు అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో బయటపడిన కైలాష్ సురేష్ గుప్తా (40 ఏళ్లు) నేడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు వారాల క్రితం తన కారును ఓ షాప్‌ ఎదురుగా పార్క్ చేసి, షాపింగ్ చేసి తిరిగి వచ్చిన పిమ్మట కారును స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుప్తా శరీరం దాదాపు 60 శాతం పైగా కాలిపోయింది.

ఈ సంఘటను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి గుప్తాను రక్షించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కారులో కూర్చున్న కైలాష్ సీట్ బెల్ట్ పెట్టుకోటం కారణంగా మంటలు చెలరేగిన సమయంలో కారులో నుండి వెలుపలకి రావటానికి ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చింది. కాలిపోయిన కారు ఫోక్స్‌వ్యాగన్ వెంటో 1.6 టిడిఐ డీజిల్ ఇంజన్ కారుగా గుర్తించాయి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రధాన కారణాలు తెలియరాలేదు.

ఇందుకు ఇందులో ఉపయోగించిన లోపపూరితమైన ఇంజన్ కారణమై ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ సంఘటనపై ఫోక్స్‌వ్యాగన్ నిపుణులు విచారణ జరుపుతున్నారు. గడచిన శనివారం ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఇదే విధంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న 52-ఏళ్ల పవన్ కుమార్ గుప్తా మృతి చెందిన సంగతి తెలిసిందే.

గుప్తా కారును స్టార్ట్ చేయగానే ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, దాంతో కారులోని సెంట్రల్ లాకింగ్ యాక్టివేట్ కావడం డోర్లు, అద్దాలు లాక్ అయిపోవడం వలన ఆయన కారులోనే చిక్కుకుపోయి, కాలిన గాయాల కారణంగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఇంజన్‌ అయి ఉంటుందనే ఉద్దేశ్యంతో, నిపుణుల బృందం ఆ మేరకు దర్యాప్తు చేపట్టింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 8, 2012, 19:33 [IST]
English summary
The fire incident involving the VW Vento TDI occurred in Pune. The owner of the car escaped from being killed only after people pulled him out as the fire engulfed the car. The fire that engulfed the car caused severe burn injuries to its driver, the now-late Kailash Gupta.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+