ఆడి ఇండియా నుండి క్యూ2, క్యూ4, క్యూ6, క్యూ8 కార్లు
ఇందులో భాగంగానే, క్యూ3, క్యూ2, క్యూ4, క్యూ6, క్యూ8 కార్లను వరుసగా (క్యూలో) దేశీయ విపణిలో ఆడి ఇండియా ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్వ బిఎమ్‌డబ్ల్యూని ఓడించి, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని ఆడి యోచిస్తోంది. ఆడి కోరిక నెరవేరాలంటే, భారత్‌లో తన ప్రోడక్ట్ ఫోలియా ఆడి విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది.
వీటిల్లో మొదటిగా ఆడి క్యూ3 ఎస్‌యూవీ మార్కెట్లోకి రానుంది. గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో క్యూ3 ఎస్‌యూవీని ఆడి ఆవిష్కరించటం జరిగింది. ఆల్-వీల్ (ఫోర్-వీల్) డ్రైవ్ సిస్టమ్‌తో లభించనున్న ఆడి క్యూ3లో తొలుత 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఇది 177 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది.
అలాగే, ఇందులో 2.0 లీటర్ డైరెక్ట్ ఇంజక్షన్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా కంపెనీ విడుదల చేసే ఆస్కారం ఉంది. ఇది సెప్టెంబర్ నెల నాటికి మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని అంచనా. డీజిల్ వేరియంట్ ఆడి క్యూ3 ఎస్‌యూవీ ధర రూ.23-26 లక్షల రేంజ్‌లో ఉండనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ, మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ వంటికార్లకు ఇది పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications
