రతన్ టాటాకు రాక్‌ఫెల్లర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్..

ప్రజల కారు టాటా నానోతో మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేయటమే కాకుండా, అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి, భారతదేశ అభివృద్ధిలో భాగమైన టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటాకు అరుదైన సత్కారం లభించింది. సమాజానికి ఆయన చేసిన సేవలను, దానధర్మాలకు గుర్తిస్తూ, రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ రతన్ టాటాకు ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది.


రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ స్థాపించి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఫౌండేషన్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులను సన్మానించింది. న్యూయార్క్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ రతన్ టాటా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారం అనేది చాలా సున్నితమైన విషయమని, ఆఫ్రికా, ఆసియా లాంటి ప్రాంతాల్లో అనేక మంది పిల్లలు ఆకలితో, పౌష్టికహార లేమితో బాధపడుతున్నారని, మానవ దృక్పతంతో ఈ వర్గం గురించి ఆలోచించాలని, వారికి కేవలం సాయం చేయటం మాత్రమే కాకుండా, సమాజంలో వారికి కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించడం కోసం ఏమైనా చేయాలని ఆయన సూచించారు.


తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సమాజం పట్ల వారి బాధ్యతలను గుర్తెరిగి, వారికి కావాల్సిన విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతుంటారని రతన్‌ టాటా చెప్పారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ సిబ్బంది సెలవుపై ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారికి కావాల్సిన సహాయ కార్యకలాపాల్లో పాల్గొని తిరిగి విధులకు హాజరవుతుంటారని ఆయన వివరించారు. గతేడాది ఈ అవార్డును అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్‌కు ఇచ్చారు.

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2012, 15:28 [IST]
English summary
Tata Sons Chairman Ratan Tata has been awarded a Lifetime Achievement Award by the prestigious Rockefeller Foundation for innovation in philanthropy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+