టాటా మోటార్స్‌లో వాటా పెంచుకున్న రతన్ టాటా

త్వరలో పదవీవిరమణ చేయనున్న టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా టాటా మోటార్స్‌లో 0.02 శాతం వాటాను (4.25 లక్షల షేర్లు) కొనుగోలు చేశారు. ఇందుకు గానూ ఆయన రూ.9.94 కోట్లను చెల్లించారు.

ఈ తాజా వాటాతో టాటా మోటార్స్‌లో రతన్ టాటా వాటా 0.3 శాతం నుంచి 0.5 శాతానికి పెరిగింది. ఈ షేర్లను ఆయన వ్యక్తిగత హోదాలో కొనుగోలు చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

టాటా మోటార్స్ ప్రపంచ అమ్మకాల్లో 12 శాతం పెరుగుదల
కాగా.. గడచిన మే నెలలో టాటా మోటార్స్ అంతర్జాతీయ అమ్మకాలు జోరుగా సాగాయి. గ్లోబల్ మార్కెట్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు జోరందుకోవటంతో మే 2012 నెలలో టాటా మోటార్స్ మొత్తం గ్లోబల్ సేల్స్ 12 శాతం వృద్ధిని సాధించి 96,089 యూనిట్లుగా నమోదయ్యాయి.

గడచిన సంవత్సరంలో ఇదే నెలతో పోల్చుకుంటే బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 35 శాతం వృద్ధి చెంది 30,094 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేవలం జాగ్వార్ అమ్మకాలు మాత్రమే 3 శాతం వృద్ధిని సాధించి 4,342 యూనిట్లు అమ్ముడుపోగా, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 42 శాతం వృద్ధిని సాధించి 25,752 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 16, 2012, 14:30 [IST]
English summary
Tata Group chairman Ratan Tata has hiked his stake in the group's flagship automobile firm Tata Motors by 4.25 lakh shares, taking his aggregate holding to 0.05%. The Tata Motors Group global wholesales, including Jaguar Land Rover, were 96,089 nos., in May 2012, higher by 12% over May 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+