ఆర్‌బిఐ వడ్డీ రేట్ల తగ్గింపు: తగ్గుముఖం పట్టనున్న కార్ లోన్స్
తాజా తగ్గింపుతో ఆర్‌బిఐ రెపో రేటు 8.50 శాతం నుండి 8 శాతానికి తగ్గింది. గడచిన మార్చి 2010 నుండి అక్టోబర్ 2011 మధ్య కాలంలో ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను మొత్తం 13 సార్లు పెంచటం జరిగింది.
ఆర్‌బిఐ తీసుకున్న తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లు కాస్తంత దిగిరానున్నాయి. ముఖ్యంగా వాహన, గృహ రుణాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే అధికంగా వాహన రుణాల కారణంగా గడచిన కొద్ది సంవత్సరాలుగా కార్ల అమ్మకాలు కూడా మందగించడం జరుగుతోంది. ఈ అధిక వడ్డీ రేట్లు, ఇంధన ధరల కారణంగా గడచిన సంవత్సరంలో దాదాపు అన్ని ప్రధాన కార్ కంపెనీలు అమ్మకాలను నష్టపోయాయి.
ప్రస్తుతం ఆర్‌బిఆ కీలక వడ్డీ రేటు (రెపో)ను 0.5 శాతం మేర తగ్గించడంతో వాహనాల రుణాలు కూడా 0.5 శాతం మేర తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది కొనుగోలుదారులు ప్రస్తుత పరిస్థితుల్లో కారును కొనుగోలు చేయాల వద్దా అనే సంశయంలో ఉన్నారు. ఒక్కసారి వడ్డీ రేట్లు క్రిందకు దిగి వచ్చినట్లయితే, ఇలాంటి వారు కూడా కార్లను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ఫలితంగా ప్రస్తుత సంవత్సరంలో కార్ల అమ్మకాల జోరు కొనసాగవచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications









