రెనో డస్టర్ బుకింగ్స్ ఓపెన్.. జులై 4న మార్కెట్లో విడుదల

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో (Renault) ఇండియా నుంచి తాజాగా మార్కెట్లోకి రానున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'డస్టర్' కోసం కంపెనీ ఇప్పటినుంచే బుకింగ్‌లను తీసుకోవటం ప్రారంభించింది. వచ్చే నెల 4వ తేదీన రెన్ డస్టర్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించింది. రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ.7.5 లక్షల రేంజ్ నుంచి రూ.11 లక్షల రేంజ్‌లో ఉండనున్నాయి.

డీలరును బట్టి రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకూ అడ్వాన్స్‌ను తీకుకొని బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) ప్రాతిపధికన కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీని అందిస్తామని డీలర్లు చెబుతున్నారు. ఐదు వేరియంట్లలో విడుదల కానున్న రెనో డస్టర్ ఎస్‌యూవీ మ్యాట్ బ్లాక్, బ్రౌన్, చాకోలేట్, సిల్వర్, వైట్, రెడ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. మరింకెందుకు ఆలస్యం, కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీని వీలైనంత త్వరగా సొంతం చేసుకోవాలంటే మీ సమీపంలోని రెనో డీలర్‌షిప్‌ను వెంటనే సందర్శించండి.


కొత్త రెనో డస్టర్‌ ఎస్‌యూవీలో యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, శాటిలైట్ ఆడియో, ఫోన్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, 475 లీటర్ల బూట్ స్పేస్, రియర్ డిఫాగ్గర్, రియర్ వైపర్, వాషర్, ఎలక్ట్రిక్ మిర్రర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, , ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

రెనో డస్టర్‌లో ముందువైపు ఉన్న సరికొత్త క్రోమ్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 16 ఇంచ్ వీల్స్ మంచి లుక్‌ను, లోపలి వైపు లెథర్ సీటింగ్ మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో ఉపయోగించిన 1.6 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ 105 బిహెచ్‌పిల శక్తి, 1.5 లీటర్ డిసిఐ డీజిల్ ఇంజన్ 85 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ డస్టర్ 13 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ డస్టర్ 19 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 20, 2012, 12:46 [IST]
English summary
The Renault Duster's date with India has been set. Renault India will launch the Duster SUV on 04th July 2012. Bookings for this SUV have already started. The affordable SUV from Renault which was unveiled at the 2012 Delhi Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+