రెనో డస్టర్ ఎస్‌యూవీ ఇప్పుడు 7-సీటర్ ఆప్షన్‌తో
రెనో డస్టర్ ఎస్‌యూవీతో ఎస్‌యూవీ మార్కెట్లో దుమ్ము లేపిన రెనో ఇండియా, ఇప్పుడు తమ లేటెస్ట్ ఎస్‌యూవీ సరికొత్త ఎస్‌యూవీలో 7-సీటర్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. రెనో డస్టర్ ఎస్‌యూవీకు భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుండటం, ఈ మోడల్‌కు ఇప్పటికే 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు రావడంతో ఈ జోరుకు మరింత జోరును అందించేందుకు ఇందులో 7-సీటర్ ఆప్షన్ కూడా జోడించటం జరిగింది.
ప్రస్తుతం రెనో డస్టర్ రెండు వరుసల (2 రో) సీట్లతో ఐదుగురు (2+3) ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. మూడవ వరుసలో సీట్లు లేకుండా లగేజ్ స్పేస్ (475 లీటర్లు) విశాలమైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే, అధిక బూట్ అవసరం లేదనుకువారు, ఎక్కువ మంది ప్రయాణించేలా లేదా లాంగ్ జర్నీలు ఎక్కువ చేయాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని 3వ వరుసలో ఎదురెదురుగా ఉండే రెండు ఫోల్డబిల్ సీట్లను ఇప్పడు కస్టమర్లు ఫిట్ చేయించుకోవచ్చు.
అవసరం లేదనుకున్నప్పుడు ఈ సీట్లను పైవైపుకు మడచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఎనిమిది వేరియంట్ల (రెండు పెట్రోల్, నాలుగు డీజిల్ వేరియంట్ల)లో రెనో డస్టర్ మార్కెట్లో లభ్యమవుతోంది. మార్కెట్లో రెనో డస్టర్ ప్రారంభ వేరియంట్ ధర రూ.7.19 లక్షలు (ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్)గా మాత్రమే ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్)గా ఉంది.
రెనో డస్టర్ ఎస్‌యూవీ మైలేజ్:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (పెట్రోల్) - 13.24 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ (85 పిఎస్ డీజిల్) - 20.45 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ (110 పిఎస్ డీజిల్) - 19.01 కెఎమ్‌పిఎల్


Click it and Unblock the Notifications









