రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలో భారీ పెంపు
ఈ పెంపు రూ.30,000 నుంచి రూ.40,000 రేంజ్‌లో ఉంది. తాజా పెంపుతో రెనో డస్టర్ పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపై అదనంగా రూ.30,000, డీజిల్ వేరియంట్ కొనుగోలుపై అదనంగా రూ.40,000 లను చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన ధరలు అక్టోబర్ 1, 2012 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వివరించింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ.7.2 లక్షల నుంచి రూ.11.3 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. రెనో డస్టర్ మొత్త ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది, ఇందులో రెండు పెట్రోల్ వేరియంట్లు కాగా మిగిలినవి డీజిల్ వేరియంట్లు. మార్కెట్లో డీజిల్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో కంపెనీ ఎక్కువ సంఖ్యలో డీజిల్ వేరియంట్లను ఆఫర్ చేస్తుంది.
రెనో డస్టర్ ఎస్‌యూవీ మైలేజ్:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (పెట్రోల్) - 13.24 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ (85 పిఎస్ డీజిల్) - 20.45 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ (110 పిఎస్ డీజిల్) - 19.01 కెఎమ్‌పిఎల్


Click it and Unblock the Notifications









