జులైలో దుమ్ము లేపనున్న రెనో డస్టర్ ఎస్‌యూవీ

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించిన ఎస్‌యూవీ 'డస్టర్' వచ్చే నెలలోనే మార్కెట్లో విడుదల కానుంది. రెనో డస్టర్ ఎస్‌యూవీని ఇప్పటికే ఇండియన్ రోడ్లపై వియవంతంగా టెస్ట్ రన్ నిర్వహించిన రెనో ఇండియా, ఇక ఈ మోడల్‌ను వాణిజ్య పరంగా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

రెనో డస్టర్ ఎస్‌యూవీ ఐదు వేరియంట్లలో విడుదల కానుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.7.5 లక్షలుగా ఉండొచ్చని అంచనా. జూన్ నెలలో రెనో డస్టర్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న ఇండియన్ వెర్షన్ డస్టర్ ఎస్‌యూవీ ఫోటోలను రెనో విడుదల చేసింది. ఈ ఫోటోను గమనిస్తే.. గతంలో ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన డస్టర్‌కు, ప్రస్తుతం మార్కెట్లోకి రానున్న డస్టర్‌కు స్వల్పంగా మార్పు కనిపిస్తుంది.


ఆటో ఎక్స్‌పో సమయంలో కంపెనీ ప్రదర్శించిన రెనో డస్టర్ బాడీ కలర్డ్ బంపర్‌ను కలిగి ఉంటే, ఈ ఇండియన్ స్పెసిఫిక్ డస్టర్ మాత్రం ముందువైపు బ్లాక్ ఫినిష్‌తో కూడిన బంపర్‌ను కలిగి ఉంది. అలాగే సైడ్ మిర్రర్స్‌లో కూడా మార్పు ఉంది. ఇది వరకటి డస్టర్‌ సైడ్ మిర్రర్స్ కొద్ది భాగం క్రోమ్ కోటింగ్, కొద్ది బాడీ కలర్‌ను కలిగి ఉండగా, ప్రస్తుత డస్టర్ సగభాగం బాడీ కలర్‌ను, సగభాగం బ్లాక్ కలర్‌ను కలిగి ఉన్నాయి.

హెడ్‌లైట్స్, గ్రిల్, అల్లాయ్ వంటివి వాటిల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. రెనో డస్టర్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ప్రస్తుతం రెనో ఫ్లూయెన్స్ సెడాన్‌లో కూడా ఇదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 85 బిహెచ్‌పి నుంచి 110 బిహెచ్‌పి పవర్ రేంజ్‌లో లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.11 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.

నాల్ట్ డస్టర్ క్రాసోవర్ ఎస్‌‌యూవీలో ఉండే కీలక ఫీచర్లు:
* యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్
* నాలుగు స్పీకర్లు, శాటిలైట్ ఆడియో
* ఫోన్ కంట్రోల్
* కీలెస్ ఎంట్రీ
* రియర్ డిఫాగ్గర్
* రియర్ వైపర్, వాషర్
* ఎలక్ట్రిక్ మిర్రర్స్
* రియర్ పార్కింగ్ సెన్సార్స్
* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
* డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
* బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్
* ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)

డస్టర్ ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ముందువైపు ఉన్న సరికొత్త క్రోమ్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా ఇందులో 16 ఇంచ్ వీల్స్, లెథర్ సీటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 1.6 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ (105 బిహెచ్‌పిల శక్తి), 1.5 లీటర్ డిసిఐ డీజిల్ ఇంజన్ (85 బిహెచ్‌పిల శక్తి) ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ డస్టర్ 13 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ డస్టర్ 19 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. ప్రస్తుతం రీనాల్ట్ ఇండియా దేశీయ మార్కెట్లో ఫ్లూయెన్స్ సెడాన్, కొలియోస్ ఎస్‌యూవీ, పల్స్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 19, 2012, 10:50 [IST]
English summary
The Renault Duster's date with India has been set. The affordable SUV from Renault which was unveiled at the 2012 Delhi Auto Expo will be launched commercially in the month of July.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+