రూ.7.19 లక్షల ప్రారంభ ధరకే డస్టర్‌ను విడుదల చేసిన రెనో
ఎస్‌యూవీ సెగ్మెంట్లో యుద్ధం మొదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) చెప్పినట్లుగా భారత మార్కెట్లో తమ ఎస్‌యూవీ విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో అత్యంత పోటీతత్వపు ధరతో కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీని కంపెనీ నేడు మార్కెట్లో వాణిజ్య పరంగా ప్రవేశపెట్టింది.
పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఎనిమిది వేరియంట్ల (రెండు పెట్రోల్, నాలుగు డీజిల్ వేరియంట్ల)లో రెనో డస్టర్ మార్కెట్లో లభ్యం కానుంది. మార్కెట్లో రెనో డస్టర్ ప్రారంభ వేరియంట్ ధర రూ.7.19 లక్షలు (ఆర్ఎక్స్ఈ 1.6 Petrol)గా మాత్రమే ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్)గా ఉంది.
రెనో డస్టర్‌లో వేరియంట్ వారీగా లభించే ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్ - రూ. 7.19 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.6 పెట్రోల్ - రూ. 8.19 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 7.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ ఆప్షన్ ప్యాక్ 85 పిఎస్ - రూ. 9.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 8.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 9.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 10.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్ - రూ. 11.29 లక్షలు
ఈ సెగ్మెంట్లోని మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్లతో కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీ పోటీ పడనుంది. రెనో డస్టర్ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి..!


Click it and Unblock the Notifications









