పల్స్ హ్యాచ్‌బ్యాక్ ధరను రూ.12,000 మేర పెంచిన రీనాల్ట్

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న (కాంపాక్ట్) కారు "పల్స్" ధరను దాదాపు రెండు శాతం మేర పెంచింది. ఇన్‌పుట్ ధరలు పెరిగిన కారణంగా పల్స్ ధరను రూ.12,000 మేర పెంచుతున్నామని కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు మార్చి 8, 2012 నుండి అమలులోకి రానున్నాయని రీనాల్ట్ ఇండియా పేర్కొంది.

గడచిన నెలలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2012లో రీనాల్ట్ ఇండియా తమ పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం పల్స్ హ్యాచ్‌బ్యాక్ కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వేరియంట్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌నే పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ లోనూ ఉపయోగించారు. పెర్ఫామెన్స్ పరంగా ఈ రెండు వేరియంట్లు ఒకేరకమైన అనుభూతినిస్తాయి.

ఈ ఇంజన్ 63 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. రీనాల్ట్ పల్స్ కేవలం బేస్ వేరియంట్ ఆర్ఎక్స్ఎల్, టాప్-ఎండ్ వేరియంట్ ఆర్ఎక్స్‌జెడ్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇప్పటి వరకూ రూ.5.77 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షల నుండి రూ.6.25 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షల రేంజ్‌లో లభ్యమవుతున్న రీనాల్ట్ పల్స్‌పై కొనుగోలుదారులు ఇక నుండి అదనంగా రూ.12,000 చెల్లించాల్సి ఉంటుంది.

గడచిన నెలలో నిస్సాన్ ఇండియా తమ చిన్న మైక్రా డీజిల్ వేరియంట్ ధరను రూ.12,000 మేర పెంచిన సంగతి తెలిసిందే. పల్స్ కూడా మైక్రా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే నిర్మించబడటంతో కంపెనీ దీని ధరను కూడా పెంచినట్లు తెలుస్తోంది. గడచిన డిసెంబర్ నెలలో రీనాల్ట్ తమ ఎస్‌యూవీ కొలియోస్ ధరను రూ.1,00,000 మేర పెంచింది.

More from DriveSpark

Article Published On: Thursday, February 23, 2012, 17:36 [IST]
English summary
The French carmaker Renault India has increased prices of its Pulse hatchback by up to Rs 12,000. Company said rising input costs is the reason for the price hike. New prices will effective from 8 March, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+