బజాజ్ ఆర్ఈ60పై ఆసక్తి తెలుపని రీనాల్ట్-నిస్సాన్

Bajaj RE60
టాటా నానో కారుకు పోటీగా తక్కువ ధరకే ఓ చిన్న కారును ప్రవేశపెడతామంటూ ఊదరగొట్టి నాలుగు చక్రాల ఆటో (బజాజ్ ఆర్ఈ60)ను విడుదల చేసిన నవ్వులపాలైన బజాజ్ ఆటో, తాము ప్రదర్శించిన ఈ ఫోర్-వీలర్‌ను నిస్సాన్-రీనాల్ట్ సంస్థలు చూసి వెళ్లాయని, అయితే దీనిని మార్కెటింగ్ చేసే విషయానికి సంబంధించి వారి నుండి ఇంత వరకూ ఎలాంటి సానుకూల స్పందన రాలేదని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు.

గడచిన సంవత్సరం మే నెలలో రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ నాసిఫ్ మాట్లాడుతూ.. బజాజ్ ఆటో స్వతహాగా అభివృద్ధి చేస్తున్న ఆల్ట్రా-లో కాస్ట్ కారు తమ నాణ్యత నిబంధనలను పాటించనట్లయితే, సదరు ఉత్పత్తి మార్కెటింగ్ చేయబోమని స్పష్టం చేసింది. అయితే, నిస్సాన్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా, వేచి చూద్దాం అన్న ధోరణితో మిన్నకుండి పోయింది.

కాగా.. బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను తొలిసారిగా ప్రదర్శించిన తర్వాత ఇరు సంస్థలు కూడా అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టును బజాజ్ ఆటో 2007లో ప్రారంభించింది. 2009లో రీనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ఛీఫ్ కార్లోస్ ఘోస్న్ మాట్లాడుతూ.. బజాజ్ ఆటో పూర్తిగా తన స్వంత టెక్నాలజీతో ఓ ఆల్ట్రా-లో కాస్ట్ కారును అభివృద్ధి చేస్తుందని, దాని తమ బ్రాండ్‌గా మార్కెటింగ్ చేస్తామని ప్రకటించారు.

ఇక బజాజ్ ఆర్ఈ60 విషయానికి వస్తే.. దీన్ని కారు అనే కన్నా పర్సనలైజ్డ్ ఆటో అని చెప్పవచ్చు. ఇందులో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను వాహనం వెనుక భాగంలో (ఆటోరిక్షాలలో ఉండే విధంగా) అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 70 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. అంతేకాదండోయ్.. ఇది ప్రతి లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీని కూడా ఇస్తుందట.

More from DriveSpark

Article Published On: Wednesday, January 25, 2012, 18:49 [IST]
English summary
Bajaj Auto's Managing Director, Rajiv Bajaj said “They (Renault-Nissan) have seen the product, but they haven't got back to us yet.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+