పెట్రోల్ వేరియంట్ పల్స్‌ను విడుదల చేయనున్న రీనాల్ట్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రీనాల్ట్ డీలర్‌షిప్ కేంద్రాలలో పల్స్ హ్యాచ్‌బ్యాక్ కేవలం డీజిల్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. పూర్తిగా నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డీజిల్ వేరియంట్ పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను రీనాల్ట్ రూపొందించింది. ఇదే విధంగా పెట్రోల్ వేరియంట్ పల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రీనాల్ట్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.
పల్స్ హ్యాచ్‌బ్యాక్ కారు చెన్నైలోని ఓరగడంలో ఉన్న రీనాల్ట్-నిస్సాన్ ప్లాంటులో ఉత్పత్తి చేయబడుతుంది. దేశీయ విపణిలో రీనాల్ట్ పల్స్ డీజిల్ వేరియంట్ ధరలు రూ.5.77 లక్షల నుండి 6.25 మధ్యలో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ పల్స్ మార్కెట్లోకి విడుదలైతే దీని ధర రూ.4 లక్షల నుండి 5.5 లక్షల మధ్యలో ఉండే ఆస్కారం ఉంది. గడచిన అక్టోబర్ నెలలో భారత్‌లో తొలిసారిగా జరిగిన ఫార్ములా వన్ రేస్ ఇండియన్ గ్రాండ్ ప్రిలో పల్స్ కారును రీనాల్ట్ ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications








