ఫ్లూయెన్స్ ఈ2 ధర తగ్గింపు; 'అడ్వాంటేజ్ ఎడిషన్' పేరుతో విడుదల

రెనో మొట్టమొదటి సారిగా ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయటం ద్వారా భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. అయితే, ఈ మోడల్‌ను ప్రవేశపెట్టినప్పుడు దీని ధర అధికంగా ఉంటడంతో దీని అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. అందుకే, ఇప్పుడు ఫ్లూయెన్స్ మోడల్‌లో లభిస్తున్న ఈ2 డీజిల్ వేరియంట్ ధరను భారీగా తగ్గించి "అడ్వాంటేజ్ ఎడిషన్" పేరుతో రెనో అందిస్తోంది. ఈ వేరియంట్‌పై రూ.1.65 లక్షల తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది.

గతంలో రెనో ఫ్లూయెన్స్ ఈ2 డీజిల్ వేరియంట్ రూ.13.64 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు లభిస్తుండేది. అయితే, ఇప్పుడు ఈ వేరియంట్‌పై ధరను భారీగా తగ్గించడంతో 2012 అడ్వాంటేజ్ ఎడిషన్ రెనో ప్లూయెన్స్ ఈ2 డీజిల్ వేరియంట్ డి-సెగ్మెంట్ సెడాన్ కేవలం రూ.11.99 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో డీజిల్ కార్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో ఈ సెగ్మెంట్లోని అవకాశాలను దక్కించుకునేందుకే కంపెనీ ఈ వేరియంట్ ధరను భారీగా తగ్గించింది.


డి-సెగ్మెంట్ (ప్రీమియం సెగ్మెంట్) సెడాన్‌లలో ధర తగ్గించబడిన రెనో ఫ్లూయెన్స్ ఈ2 డీజిల్ వేరియంట్ ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే లేదా స్టాక్ మిగిలి ఉన్నంత కాలం మాత్రమేనని కంపెనీ పేర్కొంది. దీనిని బట్టి చూస్తుంటే, ఫ్లూయెన్స్ ఈ2 డీజిల్ వేరియంట్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ వేరియంట్‌లో ఏబిఎస్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి, ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, అల్లాయ్ వీల్స్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి.

ఇందులో ఉపయోగించిన 1461సీసీ 4-సిలిండర్ ఇంజన్ 106 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ఇది లీటరు డీజిల్‌కు 20 కి.మీ. పైగా మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Sunday, April 15, 2012, 13:19 [IST]
English summary
Renault India has launched cut price of the Fluence E2 Diesel variant. Company has slashed the price of E2 Diesel variant by Rs 1.65 lakhs. This cut price version called as Advantage Edition available at Rs 11.99 lakhs, ex-showroom Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+