ఆటో ఎక్స్‌పోలో డస్టర్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన రీనాల్ట్

ఈ మేరకు ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలో కంపెనీ తమ ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీ "డస్టర్"ను ఆవష్కరించింది. పల్స్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసిన అనంతరం రీనాల్ట్ తమ డస్టర్ ఎస్‌యూవీని తొలిసారిగా భారతీయులకు పరిచయం చేసింది. ఈ ఏడాది మధ్య భాగం నాటికి డస్టర్ ఎస్‌యూవీ వాణిజ్యపరంగా దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నామని కంపెనీ పేర్కొంది.
డస్టర్ ఎస్‌యూవీ ధర మరియు ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, దీని ధర సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. డస్టర్ ఎస్‌యూవీ ధరను తక్కువగా ఉంచేందుకు గానూ, ఈ మోడల్‌ను పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. రీనాల్ట్ డస్టర్ రాకతో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ బొలెరో, స్కార్పియోలు తుడిచిపెట్టుకు పోవటం ఖాయమేనని మార్కెట్ నిపుణలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








