జులై 1 నుంచి రూ.4 మేర తగ్గనున్న పెట్రోల్ ధరలు!

వచ్చే నెల నుంచి పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జులై 1వ తేదీ నుంచి లీటర్ పెట్రోల్ ధరపై రూ.4 తగ్గింపును అందించాలని చమురు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గడటమే ఇందుకు ప్రధాన కారణం. భారత చరిత్రలో ఇది వరకెన్నడూ లేదీని విధంగా గత మే 23న చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.7.54 పెంపును విధించిన సంగతి తెలిసిందే.

అనంతరం, ఈనెల 2వ తేదీన చమురు కంపెనీలు పెట్రోల్ ధరను స్వల్పంగా లీటరుపై రూ.2 మేర తగ్గింపును ప్రకటించాయి. అయితే, తాజాగా.. లీటర్ పెట్రోల్‌పై రూ.4 మేర తగ్గింపును అందించాలన్న ప్రతిపాదన గాలిలో దీపం లాంటిందే. ఎందకంటే.. ఈ నెల ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న ఈ మూడు రోజుల్లో కూడా ప్రపంచ పెట్రోల్ ధరలు, రూపాయితో డాలర్ మారకపు విలువ అలానే స్థిరంగా కొనసాగితేనే ఈ తగ్గింపు సాధ్యమవుతుంది.

బంగారం ధర మాదిరిగానే పెట్రోల్ ధర కూడా..:

ఏ రోజుకు ఆ రోజు ధర మారే బంగారం మాదిరిగానే పెట్రోల్ ధరను కూడా ఏ రోజుకు ఆ రోజు సవరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచటం జరిగింది. ఇప్పటికే, ఈ తరహా విధానాన్ని అమెరికా, యూరప్, బ్రెజిల్ వంటి దేశాల్లో అనుసరిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం చమురు కంపెనీల అనుసరిస్తున్న నియమం ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున సమావేశమై పెట్రోల్ ధరలను సమీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మన మార్కెట్లో పెట్రోల్ ధరలను పెంచటం, తగ్గించడంపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.

కాగా.. ఈ కొత్త ప్రతిపాదనలో పెట్రోల్ ధరలను రోజూవారీ సమీక్షించి పెంచడం తగ్గించడాలపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదపై ఉన్నత స్థాయి మంత్రివర్గంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రతిపాదపై ఓ తుది నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇటు కొనుగోలుదారులకి, అటు అమ్మకపుదారులకి ఇద్దరకీ కూడా ప్రయోజాన్ని చేకూర్చి పెడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 27, 2012, 14:19 [IST]
English summary
Motorists finally have some reason to cheer as the petrol prices may be reduced soon. According to sources, oil marketing companies are mulling a remarkable cut of Rs 4 per litre from Jul 1 in view of the recent downtrend in global crude oil prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+