భారత్‌లో సివిక్ అమ్మకాలను నిలిపివేయనున్న హోండా!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'హోండా సివిక్' త్వరలోనే చరిత్రలో కలిసిపోనుంది. ఈ మోడల్‌ను ఇండియన్ మార్కెట్ నుంచి తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తున్న హోండా సివిక్ అమ్మకాలు ఆశించిన రీతిలో జరగకపోవటంతో ఈ మోడల్‌ అమ్మకాలను భారత మార్కెట్‌లో నిలిపివేయాలని హోండా భావిస్తోన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇప్పటికే హోండా సివిక్ ఉత్పత్తిని కూడా నిలిపి వేయటం జరిగింది.

హోండా సివిక్ సెడాన్ కార్లు డీలర్ల వద్ద కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో హోండా విడుదల చేసిన 2012 వెర్షన్ హోండా సివిక్ సెడాన్‌ను కూడా కంపెనీ ఇండియన్ మార్కెట్‌కు తీసుకువచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచ మార్కెట్లలో హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్, హైబ్రిడ్ వెర్షన్లలో కూడా లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ మార్కెట్లో ప్రధానంగా డీజిల్ వెర్షన్ అందుబాటులో లేకపోవటం, పెట్రోల్ వెర్షన్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో దీని అమ్మాకాలను నిలిపివేయాలని హోండా భావిస్తోంది. అయితే, ఈ విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం దేశీయ విపణిలో హోండా సివిక్ ప్రీమియం సెడాన్ ధరలు రూ.13 లక్షల నుంచి రూ.16 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతానికి హోండా సివిక్ ఇండియన్ మార్కెట్లో కనిపించకుండా పోయినప్పటికీ, త్వరలోనే డీజిల్ వెర్షన్ రూపంలో తిరిగి ఇండియాకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హోండా ఇప్పటికే ఓ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీజిల్ ఇంజన్‌ను తొలిసారిగా సివిక్ సెడాన్‌లో ఉపయోగిస్తామని కంపెనీ గతంలో పేర్కొంది.

ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సివిక్ పెట్రోల్ వెర్షన్ సెడాన్ 1.8 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌తో ఆటోమేటిక్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 132 పిఎస్‌ల శక్తిని, 17.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్ హోండా సివిక్ లీటర్ పెట్రోల్‌కు 14.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 13.9 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో హోండా సివిక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* హోండా సివిక్ 1.8ఎస్ (మ్యాన్యువల్) : రూ. 1,288,800
* హోండా సివిక్ 1.8వి (మ్యాన్యువల్) : రూ. 1,394,700
* హోండా సివిక్ 1.8వి (మ్యాన్యువల్) సన్‌రూఫ్ : రూ. 1,442,100
* హోండా సివిక్ 1.8వి (ఆటోమేటిక్) : రూ. 1,474,200
* హోండా సివిక్ 1.8వి (ఆటోమేటిక్) సన్‌రూఫ్ : రూ. 1,521,500

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Friday, August 3, 2012, 12:33 [IST]
English summary
According to recent reports, Japanese car maker Honda is mulling to stop the sales of its premium sedan Honda Civic in Indian market due to low sale volumes. Honda has already stopped the production of the Honda Civic few months ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+