బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్

భారత క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ ఇండియాతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తొలిసారిగా తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌ను ఎన్నుకోనుంది. క్రికెట్ గాడ్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ నియామకం కానున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.


బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈనెల 27వ తేదీన తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ 3-సిరీస్ (ప్రాజెక్ట్ ఎఫ్30) కారును భారత మార్కెట్‌కు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ కొత్త కారును సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో భారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియాను ఆడి ఇండియా ఓవర్‌టేక్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం, భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఆడి ఇండియా నుంచి బిమ్‌డబ్ల్యూ ఇండియా గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ఈ సెగ్మెంట్లో బలహీనపడుతున్న తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకే కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీనిపై స్పందించేందుకు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నిరాకరించింది. ఏదేమైనప్పటికీ, ఈ సందిగ్ధతకు జులై 27న తెర పడనుంది.

సరికొత్త డిజైన్, అత్యాధుక టెక్నాలజీతో అభివృద్ధి చేసిన బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ లగ్జరీ కార్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ధర విషయంలో పాత వేరియంట్‌కు కొత్త వేరియంట్‌కు పెద్దగా తేడా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇది రూ. 27 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. డ్రైవ్‌స్పార్క్ బృందం కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ విడుదలను ప్రత్యక్షంగా కవర్ చేయటానికి ముంబై వెళ్తోంది. ఇందుకు సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మా పాఠకులతో పంచుకుంటాం.

More from DriveSpark

Article Published On: Tuesday, July 24, 2012, 16:28 [IST]
English summary
Sachin Tendulkar to be the brand ambassador of BMW. Sachin Tendulkar is expected to launch the all new BMW 3 series in Mumbai on July 27, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+