దబాంగ్ 2లో కరీనా ఫ్రీ ఐటమ్‌కు సల్మాన్ భారీ గిఫ్ట్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రం విజయవంతం కావటంతో, ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దబాంగ్ 2 పేరుతో రానున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఓ ఐటమ్ సాంగ్‌ను ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఫ్రీగా చేసిందట. ఇందుకు మురిసిపోయిన సల్మాన్ ఖాన్, కరీనా కపూర్‌కు ఓ మర్చిపోలేని కానుకను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, కరీనా కపూర్ మాత్రం ఇక్కడొక మెలిక పెట్టింది. ఈ ఐటమ్ నంబర్ తాను కోరుకున్నట్లుగా తీయాలని, అంతేకాకుండా.. ఈ సినిమాలో ఇది అత్యంత ముఖ్యమైన పార్ట్‌గా ప్రమోట్ చేయాలని ఆమె షరతు పెట్టడం జరిగింది. తొలుత ఈ ఐటమ్ సాంగ్ కోసం భారీ మొత్తంలో డబ్బును తీసుకోవాలని కరీనా నిర్ణయించుకున్నప్పటికీ, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఆఫర్‌తో నయాపైసా తీసుకోకుండా సల్మాన్ ఖాన్ ఫ్రీగా ఈ ఐటమ్ నెంబర్ చేస్తున్నట్లు సమాచారం.


అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును తన దబాంగ్ 2 సినిమాలో ఐటమ్ నెంబర్ చేస్తున్న కరీనా కపూర్ కోసం సల్మాన్ ఖాన్ కానుకగా ఇవ్వనున్నాడు. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌లో రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సాధారణ సెడాన్ వెర్షన్ మరొకటి హైసెక్యూరిటీ 7-సిరీస్. ఈ హై సెక్యూరిటీ 7 సిరీస్ హైప్రొఫైల్ కలిగిన సెలబ్రిటీల కోసం బిఎమ్‌డబ్ల్యూ డిజైన్ చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ (740 ఎల్ఐ వేరియంట్) కారులో ఉపయోగించిన 2979సీసీ ఇంజన్ 240 కి.వా. గరిష్ట శక్తిని, 450 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు పెట్టే ఈ లగ్జరీ కారు కేవలం ఆరు సెండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది లీటరుకు 10 కి.మీ. మైలేజీనిస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధర రూ.86 లక్షల నుండి కోటి రూపాయల పైచిలుకే. టాక్స్‌ను తప్పించుకోవడానికే సల్మాన్ ఈ గిఫ్ట్‌ను ఇస్తున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 18, 2012, 14:53 [IST]
English summary
Salman Khan is very happy these days and the reason behind his happiness is none other than Kareena Kapoor. According to the reports, Salman is planning to gift Kareena a brand new car as Kareena Kapoor agreed to do an item number in his forthcoming film Dabangg 2.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+