ఆటో లోన్స్‌పై వడ్డీ రేటును తగ్గించిన ఎస్‌బిఐ

ఆటో రుణాలు తగ్గుముఖం పట్టాయి. లోను ద్వారా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అనువైన సమయం. ఎందుకంటే, భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) ఆటో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆటో లోన్స్‌ను అందిస్తున్న ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే ఎస్‌బిఐ అందిస్తున్న ఆటో లోన్సే అతి తక్కువగా ఉన్నాయి.

గడచిన ఏప్రిల్ నెలలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటో లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వడ్డీని రేటును 11.25 శాతానికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆటో లోన్స్‌పై వడ్డీ రేటును 11.25 శాతం నుంచి 10.75 శాతానికి (50 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ పేర్కొంది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 7, 2012 నుంచి అమలులోకి వస్తాయి.

జులై 31, 2012న ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)ను 1 శాతం మేర తగ్గిచడంతో బ్యాంకులు కూడా రుణాలపై అలాగే డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇందులో భాగంగానే ఎస్‌బిఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది.

More from DriveSpark

Article Published On: Saturday, August 4, 2012, 17:54 [IST]
English summary
State Bank Of India has announced a 0.5% cut in car loan rates to 10.75% fro, 11.25%. The new rates of interest will be applicable from August 7, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+