వాహన రుణాలపై వడ్డీ రేటును పెంచనున్న ఎస్‌బిఎఐ!

వాహన రుణాలపై ఇతర బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లతో సరితూగేందుకు ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం, ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ 11.50 శాతం నుండి 17 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 11.50 శాతం నుండి 12.25 శాతం, యాక్సిస్ బ్యాంక్ 11.5 శాతం నుండి 14.25 శాతం మేర వడ్డీ రేట్లను అందిస్తుండగా, ఎస్‌బిఐ కేవలం 11.25 శాతం వడ్డీ రేటుకే రుణాలను అందిస్తుంది.
సెప్టెంబర్ 2011లో కార్ లోన్ పోర్ట్‌ఫోలియో ఎస్‌బిఐ 25.25 శాతం వృద్ధిని నమోదు చేసుకుని రూ.22,025 కోట్లకు పెరిగింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మాత్రం ఈ వృద్ధి ఆశించినతంగా లేదు. మార్చి 2011 చివరి నాటికి ఎస్‌బిఐ ఆటో లోన్ పోర్ట్‌ఫోలియో రూ.20,910 కోట్లుగా ఉంది. కాగా.. ఆర్‌బిఐ లెక్కల ప్రకారం, నవంబర్ 2011లో అన్ని బ్యాంకుల వాహన రుణ పోర్ట్‌ఫోలియో రూ.86,877 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








