టింటెడ్ గ్లాస్‌లను తొలగించండి: పోలీసులకు సుప్రీం కోర్టు హెచ్చరిక

మోటార్‌ వానాలకు అక్రమంగా ఉపయోగించే సన్‌ ఫిల్ములు, టింటెడ్ గ్లాస్‌లను తొలగించాల్సిందిగా దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ నిబంధనను అమలు చేయడంలో అధికారుల విఫలం కావడంతో సుప్రీం కోర్టు గుర్రమంటోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్‌లలకు సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.

వాహనాలపై టింటెడ్ గ్లాస్‌లను తొలగించడంలో సదరు అధికారులు విఫలమైనట్లయితే, చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని జస్టిస్ బి ఎస్ చౌహాన్, జస్టిస్ స్వాతంతర్ కుమార్‌లో కూడిన ధర్మాసనం పేర్కొంది. వాహనాలకు పరిమితికి మించి టింట్ చేయబడిన ఉన్న గ్లాస్‌లను, సన్ ఫిల్ములను ఉపయోగించినట్లయితే, అటువంటి వాహన యజమానులకు కేవలం జరిమానా మాత్రమే విధించి వదలి పెట్టకుండా, సన్ ఫిల్మ్‌ను, టింట్‌ను తొలగించాలని ఈ ధర్మాసనం పేర్కొంది.

వాహనాలకు నల్లటి అద్దాలను ఉపయోగించి అక్రమాలు, నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో, వాహనాలకు సన్ ఫిల్ములు, టింటెడ్ గ్లాస్‌ల వాడకాన్ని నిషేధిస్తూ గడచిన మే నెల నుంచి సుప్రీం కోర్టు కొత్త ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలు కాకపోవటం, సొసైటీలోని ప్రముఖులు తమ కార్లకు ఇంకా సన్ ఫిల్ములను తొలగించక పోవటం వంటి అంశాలు సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లాయి. దీంతో సుప్రీం కోర్టు ఈ నిబంధన అమలు పట్ల పోలీసు ఉన్నతాధికారులకు చివాట్లు పెట్టింది.

More from DriveSpark

Article Published On: Monday, August 6, 2012, 15:11 [IST]
English summary
The Supreme Court has warned the Director Generals of Police and Commissioners of Police in all the states and union territories of contempt action if they fail to take action on use of tinted glasses in vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+