మరోసారి ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఎగరేసుకుపోయిన వెటెల్

By Ravi

గ్రేటర్‌ నోయిడాలో బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ (బిఐసి)లో ఆదివారం రోజున జరిగిన ఫార్ములావన్‌ రేస్ ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ ఫైనల్‌ టైటిల్‌ను జర్మనీకి చెందిన రెడ్‌బుల్‌ రేసర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ సొంతం చేసుకున్నాడు. ఈ రేస్‌లో వెటెల్‌ కేవలం ఒక గంట 35నిమిషాల 30సెకన్లలోనే నిర్ధేశిత గమ్యాన్ని పూర్తి చేశాడు. వెటెల్ భారత్‌లో వరుసగా రెండవసారి కూడా ఈ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. గడచిన సంవత్సరంలో ఇదే ట్రాక్‌పై ఇండియాలోనే మొట్టమొదటి సారిగా జరిగిన ఎయిర్‌టెల్ ఇండియన్ గ్రాండ్ ప్రిలో కూడా సెబాస్టియన్ వెటల్ విజేతగా నిలిచాడు.

Sebastian Vettel Wins Indian Formula One Grand Prix Title

వెటెల్ ఇప్పటి వరకూ వరుసగా 11వ సార్లు టైటిల్‌‌ను గెలుచుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫైయింగ్‌ రేస్‌లో అదరగొట్టిన వెటెల్, ఫైనల్ రేస్‌లో కూడా అదే జోరును కనబరచాడు. ఈ రేస్‌లో బ్రిటన్‌‌కు చెందిన మెర్సిడెస్‌ రేసర్‌ జెన్సన్‌ బటన్‌ రెండవ స్థానంలో నిలువగా, ఫెరారీ రేసర్ ఫెర్నాండో అల్పోన్సో మూడవ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఇండియన్ రేసర్లకు మాత్రం ఈ గ్రాండ్ ప్రి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. ఫోర్స్‌ఇండియా రేసర్‌ సటిల్‌ తొమ్మిదోస్థానంతో సరిపెట్టుకోగా, ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి రేసర్‌ నారాయణ్‌ కార్తికేయన్‌ 17వ స్థానానికి జారిపోయాడు.

ఈసారి మాత్రం ఇండియన్ గ్రాండ్ ప్రి ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగిపోయింది. గ్రాండ్ ప్రి కోసం దాదాపు అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యుట్‌లో సుమారు లక్షా పది వేల మందికి ఆతిథ్యం కల్పించవచ్చు. ఆదివారం రోజున ఫైనల్ రేస్ కావటంతో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. ఈ ఫార్ములా వన్ రేస్‌ను వీక్షించేందుకు ఇటు భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి అభిమానులు రావటంతో ఢిల్లీ సర్కారు భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. ఈ రేస్‌ ఈవెంట్‌లో సచిన్‌ టెండూల్కర్‌తో, షారూఖ్‌ఖాన్‌, దీపికా పడుకునే, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్‌ వంటి పలువురు ప్రముఖులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

More from DriveSpark

Article Published On: Monday, October 29, 2012, 13:20 [IST]
English summary
Red Bull driver Sebastian Vettel won the Indian Formula One Grand Prix at the Buddh International Circuit in Greater Noida on Sunday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+