హైదరాబాద్‌లో సెల్ఫ్ డ్రైవ్ సేవలను ప్రారంభించిన కార్జ్‌ఆన్‌రెంట్

ఏదైనా ట్రావెల్, టాక్సీ సర్వీస్ కంపెనీల నుంచి కార్లను అద్దెకు తీసుకోవాలంటే, కారుతో పాటుగా డ్రైవర్ కూడా తప్పనిసరిగా ఉంటాడు. అయితే, మనకు డ్రైవింగ్ వచ్చి ఒక వారం రోజుల పాటు కారును మనతోనే ఉంచుకోవాలనుకుంటే మాత్రం కుదరుదు. అందుకే, ఢిల్లీకి చెందిన మల్టీ సర్వీస్ ట్యాక్సీ కంపెనీ 'కార్జ్‌ఆన్‌రెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్' హైదరాబాద్‌లో ఈ తరహా సేవలను ప్రారంభించింది.

సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కార్లను అద్దెకిచ్చే సర్వీసులను కార్జ్ఆన్‌రెంట్ ఆఫర్ చేస్తోంది. ఏదైనా నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య (ఇంట్రాసిటీ), లేదా వివిధ నగరాల మధ్య (ఇంటర్‌సిటీ) సేవలనూ కూడా కంపెనీ ఇక్కడ విస్తరించింది. అంతేకాకుండా, విదేశాలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల్లో సైతం కార్లను ఇక్కడి నుంచే బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఈ కంపెనీ కల్పిస్తోంది.

విదేశాల్లో ఈ సేవల కోసం 145 దేశాల్లోని పలు కార్ రెంటల్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని కార్జ్‌ఆన్‌రెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రాజీవ్ కె.విజ్ తెలిపారు. తాము అందిస్తున్న అన్ని రకాల సేవలను బుక్ చేసుకోవటానికి 0888 222 22 22 టోల్ ఫ్రీ నెంబర్‌పై కాల్ చేస్తే సరిపోతుందిన ఆయన తెలిపారు. కార్జ్ఆన్‌రెంట్ ఇప్పటికే హైదరాబాద్‌లో ఈజీక్యాబ్ పేరుతో రేడియో క్యాబ్ సర్వీసులను అందిస్తోంది,

కంపెనీ కొత్తగా ప్రారంభించిన సెల్ఫ్ డ్రైవ్ సేవల కోసం 100 కార్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో టాటా ఇండికా నుంచి మెర్సిడిస్ బెంజ్ వరకూ అన్ని రకాల కార్లు అందుబాటులో ఉంటాయి. సెల్ఫ్ డ్రైవ్ సేవల కోసం కారును బుక్ చేసుకున్న వారికి, సదరు కారును కంపెనీ నేరుగా వారి ఇంటికి తీసుకువస్తుంది. అద్దె కాలం ముగిసిన తర్వాత మళ్లీ వారే ఇంటికొచ్చి కారును తీసుకెళ్తారు.

కారును అద్దెకు ఇవ్వటానికి గాను కస్టమర్ నుంచి క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, ఒక ఫొటో ఐడి కార్డును (జిరాక్స్) తీసుకొంటారు. మిడ్-రేంజ్ కారుకు ఒక రోజు గాను అద్దె సుమారు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ఉంటుంది. నిర్దిష్ట దూరం దాటినట్లయితే, కి.మీ.కు రూ.15 చొప్పున వసూలు చేస్తారు.

More from DriveSpark

Article Published On: Monday, August 27, 2012, 11:15 [IST]
English summary
Delhi based multi-utility vehicles transport service company Carzonrent has started self-driven services in Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+