ఆగస్టు నుంచి పెరగనున్న స్కొడా కార్ల ధరలు

చెక్ రిపబ్లిక్ కార్ స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలను పెంచింది. వచ్చే నెల ఆరంభం నుంచి అన్ని స్కొడా కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఆగస్టు నెల మొదటి వారంలో తమ కార్ల ధరలను 1 శాతం నుంచి 1.8 శాతం మేర పెంచనున్నట్లు స్కొడా ఇండియా పేర్కొంది.

పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలు, దోబూచులాడుతున్న రూపాయి మారకపు విలవలు ధరల పెంపుకు దారితీసాయని కంపెనీ పేర్కొంది. గడచిన కొద్ది నెలలకు స్కొడా ఇండియా భారత మార్కెట్లో ప్రోత్సాహకర వృద్ధిని కనబరుస్తోంది. స్కొడా ఇటీవల మార్కెట్లోకి విడుదల చీప్ అండ్ బెస్ట సెడాన్ స్కొడా ర్యాపిడ్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించడంతో ఈ వృద్ధి సాధ్యమయ్యింది.

జూన్ 2011తో పోలిస్తే జూన్ 2012 నెలలో కంపెనీ ఏకంగా 89 శాతం వృద్ధిని కనబరిచింది. 10 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన స్కొడా ఆటోకు, ఈ మార్కెట్ అత్యంత కీలక మార్కెట్‌గా నిలిచింది. స్కొడా తన ''2018 వృద్ధి ప్రణాళిక"లో భాగంగా తన ప్రపంచ అమ్మకాలను ఏటా కనీసం 1.5 మిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 24, 2012, 18:46 [IST]
English summary
Skoda Auto India has announced a price hike of its cars effective from early August 2012. The hike will range between 1% and 1.8% across its entire product range.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+