పొడవైన లారా సెడాన్‌ను అభివృద్ధి చేయనున్న స్కొడా
ప్రస్తుతం లభిస్తున్న లారా సెడాన్ స్థానాన్ని భర్తీ చేస్తూ షార్టర్ వెర్షన్ సెడాన్ మార్కెట్లోకి రానుంది. ఇక లాంగర్ వెర్షన్ లారా సెడాన్ విషయానికి వస్తే, ఎంట్రీ లెవల్ లారాకు, సూపర్బ్‌కు మధ్యలో ఈ వెర్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్కొడా గతంలో ఆవిష్కరించిన మిషన్ ఎల్, విజన్ డి కాన్సెప్ట్ మోడళ్ల డిజైన్ నుండి స్ఫూర్తి పొంది అప్‌గ్రేడెడ్ వెర్షన్ లారాను మరింత స్టయిలిష్‌గా డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అప్‌గ్రేడెడ్ స్కొడా లారాలో యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ పార్క్ అసిస్టెన్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న స్కొడా లారా 1,968సీసీ డీజిల్ ఇంజన్, 1,798సీసీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. మార్కెట్లో దీని ధర రూ.13.60 లక్షల నుండి రూ.18.40 లక్షల రేంజ్‌లో ఉంది. కాగా.. అప్‌గ్రేడెడ్ లారా సెడాన్ దీని కన్నా కాస్తంత అధిక ధరతో 2013లో మార్కెట్లోకి రానుంది.


Click it and Unblock the Notifications









