వెంటో మాదిరిగానే స్కొడా ర్యాపిడ్‌లో కూడా మంటలు

పూనేలోని ఎఫ్‌సి రోడ్డులో చోటు చేసుకున్న ఈ సంఘటన యావత్ ఆటోమొబైల్ ప్రియులను అప్రమత్తం చేసింది. 40 ఏళ్ల కైలాష్ సురేష్ గుప్తా, ఓ షాప్‌కు ఎదురుగా పార్క్ చేసి, షాపింగ్ చేసి తిరిగి వచ్చిన పిమ్మట కారును స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.
ఈ సంఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. స్కొడా ఇంజనీర్లు ఈ ప్రమాదం గురించి విచారణ ప్రారంభించారు. ఢిల్లీకు చెందిన నితిన్ మల్హోత్రా తన కారును పార్క్ చేసి డాక్టర్‌ను సంప్రదించి వచ్చే లోపుగా కారులో నుండి ఉన్నట్టుండి మంటలు చెలరేగటాన్ని గుర్తించాడు.
అప్పటికే ర్యాపిడ్ ముందు భాగం చాలా వరకూ కాలిపోయింది. స్కొడా ఇండియా కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ చౌక సెడాన్‌లో ఇలా మంటలు చెలరేగటం ఇదే మొదటిసారి. వెంటో డీజిల్, ర్యాపిడ్ డీజిల్ వేరియంట్లలో ఒకేరకమైన డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ఒకవేళ డీజిల్ ఇంజన్ లోపం వలన ప్రమాదం జరిగి ఉండొచ్చనే ఉద్దేశ్యంతో కంపెనీ నిపుణులు ఆ దిశగా కూడా విచారణలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








