తక్కువ ధర కలిగిన ఫ్యాబియాను విడుదల చేయనున్న స్కొడా

స్కొడా ఫ్యాబియా తయారీని ఎక్కువ భాగం లోకలైజేషన్ చేయటం ద్వారా ఇది సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఫ్యాబియా తయారీలో ఉపయోగిస్తున్న విడిభాగాల్లో చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. భారత మార్కెట్లో లభ్యమయ్యే విడిభాగాలను ఉపయోగించి ఫ్యాబియాను ఉత్పత్తి చేసినట్లయితే, ఉత్పాదక వ్యయం తగ్గి తక్కువ ధరకే దీనిని అందించే అవకాశం ఉంటుంది.
స్కొడా ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ రావు మాట్లాడుతూ.. ఎక్కువ భాగం లోకలైజ్ చేయబడిన ఫ్యాబియాను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము మన పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకునేందుకు ప్రధానంగా సర్వీస్, సేల్స్ అండ్ మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం స్కొడా ఫ్యాబియా ఉత్పత్తిలో లోకలైజేషన్ కేవలం 50 శాతంగా మాత్రమే ఉంది. రానున్న కాలంలో దీనిని 80 శాతం నుంచి 90 శాతానికి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం స్కొడా అందిస్తున్న ఫ్యాబియా ధరలు రూ.5 లక్షల నుంచి రూ.8.5 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. స్కొడా ఫ్యాబియా లోకలైజేషన్‌ను పెంచినట్లయితే, కొత్త ఫ్యాబియా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








