ఇండియన్ వెర్షన్ సిటిగోను ఆవిష్కరించిన స్కొడా ఆటో

త్వరలోనే ఈ మోడల్ వాణిజ్యపరంగా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. తొలుత యూరోపియన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని మూడు డోర్లు కలిగిన సిటిగో హ్యాచ్‌బ్యాక్‌ను స్కొడా ఆటో అభివృద్ధి చేసింది. అయితే, ప్రస్తుతం భారత్‌లో చిన్న కార్ల వ్యాపారం ఊపందుకోవడంతో ఇక్కడి మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఇందులో ఓ ఫైవ్-డోర్ వెర్షన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది.
జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ దేశీయ విపణిలో విడుదల చేయనున్న అప్ (పోలో హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన), స్కొడా సిటిగో రెండు మోడళ్లు ఇంచు మించు ఒకేలా ఉండనున్నాయి. ఇంజన్, పెర్ఫామెన్స్‌ల విషయంలో ఇవి రెండూ సమానమే. ఒక్క బ్రాండ్ నేమ్ మాత్రమే మారతుంది. స్కొడా ఆటో ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోనే సిటిగో కారు అతి చిన్న కారుగా నిలువనుంది.
రూ.3.5 లక్షల నుండి రూ.4.5 లక్షల మధ్యలో దీని ధర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఇదే విభాగంలో దూసుకుపోతున్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10, చెవర్లే బీట్, టొయోటా ఎతియోస్ లివా, హోండా బ్రయో వంటిన్న కాంపార్ట్ కార్లతో స్కొడా సిటిగో తలపడనుంది.


Click it and Unblock the Notifications








