ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ: గాలి, సూర్యరశ్మితో పనిచేసే కారు
గతంలో చెన్నైలోని ప్రీస్ట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు నాగపట్నం జిల్లాకు చెందిన హై-టెక్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్‌తో కలిసి ఇటు నీటిలోనూ, అటు రోడ్డుపైనా ప్రయాణించే విభిన్న కాన్సెప్ట్ కార్లను రూపొందించిందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హై-టెక్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్ చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో కలిసి మరో సరికొత్త కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు.
పైసా ఇంధన ఖర్చు లేకుండా పవన, సౌర విద్యుత్‌తో పనిచేసే ఓ కాన్సెప్ట్ కారును వీరు తయారు చేశారు. ఈ కారుకు వెనుక భాగంలో ఓ ప్రొపెల్లర్, పై భాగంలో సోలార్ ప్యానెల్ ఉంటుంది. కారు చలనంలో వెనుక వైపు అమర్చిన ఫ్యాన్ తిరిగడం ప్రారంభించి కారులో అమర్చిన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అలాగే, కారుకు పై భాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్ ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు సౌర శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి కారు నడవటానికి ఉపకరిస్తుంది.
దీనిని కేవలం కారుగా మాత్రమే కాకుండా.. ఇన్వర్టెర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఉండే బ్యాటరీ పవర్‌ను రాత్రివేళ ఇళ్లకు వినియోగించుకోవచ్చు. ఈ కారు మొత్తం బరువు 120 కేజీలు, ఇది 5.5 అడుగుల పొడవును, 4.5 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. దీనిని రూపొందించడానికి సుమారు రూ.55,000 ఖర్చు అయిందని విద్యార్థులు తెలిపారు.


Click it and Unblock the Notifications









