స్విఫ్ట్, ఫెరారీ గ్లోబల్ రీకాల్.. ఇండియాలో కార్లు సేఫ్..!

జపాన్‌లో తయారై విదేశీ మార్కెట్లలో అమ్ముడైన స్విఫ్ట్ కార్లలో లోపపూరితమైన ఫ్యూయెల్ పైప్ కారణంగా పెట్రోల్ లీక్ అయ్యే సమస్య ఉండటంతో 1,09,000 స్విఫ్ట్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సుజుకి మోటార్ కార్ప్ ప్రకటించింది. సెప్టెంబర్ 2010 - ఏప్రిల్ 2012 మధ్య కాలంలో తయారైన స్విఫ్ట్ కార్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి. ఇందులో మొత్తం 55,146 కార్లను జపాన్‌లో రీకాల్ చేయగా, 53,801 కార్లను ఆస్ట్రేలియా, మెక్సికో, యూరోపియన్ దేశాల నుండి రీకాల్ చేస్తున్నట్లు సుజుకి తెలిపింది.
ఫెరారీ కార్లు కూడా వెనక్కే..!!
ఇదిలా ఉండగా.. ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ ఫెరారీ కూడా 458 ఇటాలియా, కాలిఫోర్నియా మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. వీటిల్లో ఉపయోగించిన వి8 ఇంజన్ కోసం తయారు చేసిన క్రాంక్‌షఫ్ట్ ఫినిషింగ్ లోపం కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నామని ఫెరారీ పేర్కొంది. ఈ లోపం కారణంగా కారులో అనవసరమైన కదలికలు (వైబ్రేషన్స్) వచ్చి ఇంజన్ పాడయ్యే ఆస్కారం ఉందని కంపెనీ తెలిపింది.
అయితే, ఇండియాలో విక్రయించిన ఈ రెండు మోడళ్లలో ఎలాంటి ఇబ్బంది లేదని ఫెరారీ పేర్కొనడం గమనార్హం. ఫెరారీ తయారు చేసిన మొత్తం 13,000 కార్లకు గానూ 206 కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఫెరారీ గుర్తించింది. ఈ రీకాల్ గురించి తమ కస్టమర్లకు ప్రత్యేకంగా ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నామని ఫెరారీ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








